పవన్ కళ్యాణ్ కోసం సంతోష్ శ్రీనివాస్ వెయిటింగ్ ముగిసినట్లే!

0
903

పవన్ కళ్యాణ్ కోసం సంతోష్ శ్రీనివాస్ వెయిటింగ్ ముగిసినట్లే!

Pawan Kalyan Next Movie పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు..కానీ.. అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో పవన్ లీనమైపోయాడు. మరో సినిమా చేసే అవకాశం కూడా లేదు అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ పవన్ ప్రముఖుల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ ఒప్పదం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు పవన్ శిబిరం నుంచి కానీ ఇటు మైత్రి మూవీస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి.

పూర్తిగా రాజకీయాలకు పరిమితం

అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం అభిమానులని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

మరో సినిమా చేసే అవకాశం లేదా

రాజకీయాల్లో బిజీ అవుతున్న నేపథ్యంలో తాను మరో సినిమాలో నటించే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ ఆ మధ్యన క్లారిటీ ఇచ్చారు.

మైత్రి మూవీస్‌తో ఒప్పందం

పవన్ కళ్యాణ్ తాను సినిమాలు చేయనని చెప్పినా తదుపరి చిత్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మైత్రి మూవీస్ నిర్మాణంలో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గతంలో అడ్వాన్స్ తీసుకున్నాడని, దీనితో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసీ అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

పవన్ కోసం సంతోష శ్రీవివాస్ వెయిటింగ్ మైత్రి మూవీస్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటించే చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. తమిళ చిత్రం తేరి కథని పవన్ కు అనుగుణంగా సంతోష్ శ్రీవాస్ రెడీ చేసాడట. పవన్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు.

వైటింగ్ ముగిసినట్లే

వైటింగ్ ముగిసినట్లే అంటే గుడ్ న్యూస్ కాదు. బ్యాడ్ న్యూసే. తనకు సినిమా చేసే ఉద్దేశం లేదని, ఇక వెయిట్ చేయకుండా మరో సినిమా చేసుకోవాలని సంతోష్ శ్రీనివాస్ కు పవన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఏఎం రత్నం కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న నిర్మాతల్లో ఏఎం రత్నం కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించారాయన. ఆ మధ్యన రత్నం నిర్మాణంలో ఆర్ టి నేసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ అది పట్టాలు ఎక్కలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here