అంతః కరణ శుద్ధి తో ఒక నిర్ణయం తీసుకున్న కొరటాల శివ

అంతః కరణ శుద్ధి తో కొరటాల శివ

0
699

కొరటాల శివ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరు తెలియనివారు ఉండరు..ఎందుకంటే అయన వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న దర్శకుడు. రీసెంట్ గా మహేష్ బాబు తో భరత్ అనే నేను మూవీ చేసి మరో భారీ విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నాడు.విదేశాల్లో కూడా ఈ సిన్మా మంచి వసూళ్లే రాబడుతోంది.అయితే కొరటాల శివ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో ఉండబోతుంది అని సమాచారం. ఇది లా ఉండగా కొరటాల శివ నిర్మాత గా మరనున్నాడు అనే వార్త కూడా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ సొంతగా ఒక బ్యానర్ స్థాపించే పని లో ఉన్నాడని, ఆ బ్యానర్ ద్వార తన దగ్గర ఉన్న కథ ల తో ఆయన దగ్గర పనే చేసే వారిని యువ దర్శకులు గా పరిచయం చేయాలనుకుంటునాడని ఫిల్మ్ నగర్ లో గుస గుస లు వినిపిస్తున్నాయి.అయితే ఆయన దగ్గర ఉన్న అన్ని కథ లను ఆయనే చేసే వరకి చాల టైం పడుతుంది అనీ,అందుకే తన కథ లను సొంత బ్యానర్ ద్వార యువ దర్శకుల తో చెప్పించాలి అని నిర్మాత గా మారడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.దర్శకుడి గా మంచి పేరు ను సంపాదించుకున్న కొరటాల శివ నిర్మాత గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here