అగ్ర హీరో లను సైతం దాటి దూసుకుపోతున్న మహానటి. ఓవర్సెస్ కలెక్షన్స్ ను ప్రకటించిన సినీ విశ్లేషకుడు.

boxoffice queen

0
914

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్,ప్రియాంక దత్ నిర్మించిన సినిమా మహా నటి .అలనాటి అగ్ర తార సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. అక్కడ అగ్ర హీరోల సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడి మరీ కలెక్షన్లు దోచేస్తుంది.సాధారణంగా ఓవర్సిస్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ మూవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ వాళ్ళు ఇప్పుడు కంటెంట్ బేస్డ్ మూవీ లను సైతం ఆదరిస్తున్నారు. అయితే గత మంగళవారం 139 లోకేషన్లల్లో ప్రివ్యూల ద్వారా రెండులక్షల తోంభైఏడు వేల తోమ్మిది వందల తోంభై ఏడు డాలర్లు రాబట్టింది.

అలాగే బుధవారం కూడా 142 లోకేషన్లల్లో లక్ష తోంబై రెండు వేల రెండు వందల పద్నాలుగు డాలర్లు రాబట్టింది. గురువారం నాటికి లక్ష ముప్ఫై తోమ్మిది వేల నూటయాబై ఒకటి డాలర్ల కలెక్షన్లు రాబట్టి మొత్తంగా ఆరు లక్షల ఇరవై తోమ్మిది వేల మూడు వందల ఆరవై రెండు డాలర్లు కొల్లగొట్టింది.. సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుండటం, కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం చూస్తుంటే ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమా కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వార రిలీజ్ చేశారు.  ఈ సినిమాకు ఇంకా మంచి టాక్‌తో ఈ కలెక్షన్లు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి అని తెలిపారు…దీన్ని బట్టే తెలుస్తుంది నిజంగా సావిత్రి గారు ఎందుకు మహా నటి అయ్యారు అనీ అంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here