అమ్మ కోసం దర్శకుడి గా మారిన హీరో నాగశౌర్య.

new avatar

0
751

చాల కాలం తర్వాత ఛలో అంటూ ఈ సంవత్సరం భారీ హిట్ అందుకున్న హీరో నాగశౌర్య..అయితే ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లొనే నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాడు..ఇదిలా ఉండగా నాగశౌర్య దర్శకుడి గా అవతారం ఎత్తాడు.ఒక చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసేశాడు.. అయితే దర్శకుడిగా ఆయన చేసింది బిగ్ స్క్రీన్ సినిమా అయితే కాదులేండి. కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే.అయితే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ను కూడా తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్‌లోనే రూపొందించి
డైరెక్ట్ చేశాడు.ఇంతకు ఆ షార్ట్ ఫిలిం ఏంటి,దేని గురించి అంటే
తనమాతృమూర్తిపై ఉన్న ప్రేమతో ‘భూమి’ అనే ఒక టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేశాడు నాగశౌర్య.అయితే అల్రెడీ చిత్రీకరణ పూర్తయిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని మాతృదినోత్సవం సందర్భంగా వాళ్ల అమ్మకు గుర్తు గా ఆమెకు అంకితం చేయడానికి ఈ షార్ట్ ఫిలిం ను చేశాడు .ఇది ఈరోజు మే 13న విడుదల చేయబోతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ చాలా బాగా వచ్చిందట,భవిష్యత్‌లో కూడా నాగశౌర్య మూవీని డైరెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఐరా క్రియేషన్స్ యూనిట్ తెలుపుతుంది.చూడాలి మరి నాగ శౌర్య భవిష్యత్తు లో తన సొంత బ్యానర్ లొనే ఏదైనా సినిమా ను డైరెక్ట్ చేస్తాడేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here