అమ్మ పాత్ర కు కీర్తి ని అమ్మే ఎంచుకుంది-సావిత్రి కూతురు.

సావిత్రి కూతురు.

0
893

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె లు ప్రియాంక దత్,స్వప్న దత నిర్మాతలు గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మహా నటి”బుధవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులే కాదు సినీ పండితులు సైతం బ్రహ్మ రథం పడుతున్నారు.రోజు రోజుకి కలెక్షన్ల వర్షం పెరుగుతూనే ఉంది.’మహా నటి సినిమా ఒక అద్భుతం, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా,నిజంగా ఆ మహానటి ని మళ్ళీ చూసుకునే అదృష్టం మళ్ళీ మాకు అందించారు.అంటూ ప్రేక్షకులు తమ అనుభూతి ని పంచుకుంటున్నారు.మహానటి సావిత్రిగా కీర్తి సురేష్, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంపై సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తూ తెర మీద తన అమ్మను చూసుకొని ఆ అనుభూతి ని మీడియా ద్వార పంచుకున్నారు. “చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూశాను.ఈ చిత్రంలో కీర్తి నటన చూసిన తర్వాత తన పాత్ర కోసం కీర్తి సురేష్ ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోంది” అని సంబరపడ్డారు. ఆ ఆనందం లో ఆమె కంట నీరు పెట్టుకున్నారు.ఇక సావిత్రి అల్లుడు గోవింద్ గారు మాట్లాడుతూ.. “సావిత్రిని మించిన నటి లేరని.. అందరూ అంటుంటారు… సావిత్రిని మించిన నటి రావాలని నేను అనుకనే వాణి ఈ ‘మహానటి’ చిత్రం ద్వారా నా కోరిక తీరింది. సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించింది” అని కీర్తిసురేష్ ను కొనియాడారు.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సెస్ లోను మంచి కలక్షన్సే కొల్లగొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here