ఈ కృష్ణార్జునులు యుద్ధం లో గెలుస్తారా..?

నటుడు నాని.దాదాపు వరుస హిట్ల తో ప్రేక్షకుల లో తన క్రేజ్

0
667

న్యాచురల్ స్టార్ అనగానే మన అందరికి టక్కుమని గుర్తొచ్చే
నటుడు నాని.దాదాపు వరుస హిట్ల తో ప్రేక్షకుల లో తన క్రేజ్ ని అమాంతం పెంచేసి ఇప్పుడు మరో హిట్టు కొట్టడానికి రెడీ అయిపోయాడు నాని.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరిష్ పెద్ది నిర్మాతలుగా మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం
‎’కృష్ణార్జునయుద్ధం’. ఈ సినిమాలో నాని ‎ద్విపాత్రాభినయంలో నటిస్తుడటం విశేషం.. ఇదీ వరకే రెండు చిత్రాల్లో డబుల్ రోల్ పోషించి ఒక చిత్రం తో అపజయం చవిచూసి,ఇంకో చిత్రం తో విజయాన్ని చవిచూశాడు నాని..
‎మరి మూడోసారి డబుల్ రోల్ చేస్తున్న కృషార్జునయుద్ధం లో
‎రాకింగ్ స్టార్ లా క్లాస్ గెటప్ లో ,పల్లె టూరి యువకుడిగా మాస్ గేటప్ లో నాని తెరపై ఎలాంటి విందును అందిస్తాడో అని
‎ప్రేక్షకులలొనే కాదు,సినివర్గాలలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది.. ఈ చిత్రం లో నాని కి జంటగా మలయాళం బ్యూటీ, ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది..

సందీప్ కిషన్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,శర్వానంద్ కి ఎక్స్ ప్రెస్ రాజా లాంటి భారీ విజయాలను అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ మరీ నాచురల్ స్టార్ నాని కి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలంటే రేపటి వరకి ఆగాల్సిందే.
ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ ఐన వారనికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనేనేను కూడ వస్తుoడటం విశేషం.. నాని సినిమా ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చిన సినిమా ఎగిరిపోవడం కాయం…మరి ఇవన్నీ తెలిసీ కూడ చిత్రబృందం రిలీజ్ కి రెడీ ఐపోయింది.. మరీ ఈ కృష్ణా ర్జునులు యుద్ధం లో గెలుస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here