ఈ సారైనా ఆచారి యాత్ర ముందుకు సాగేనా..?

0
667

అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టూ గా ఉంది హీరో మంచు విష్ణు పరిస్థితి.బ్రహ్మానందం, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”.ఈ సినిమా మొదలయిన దగ్గర నుండి ఎదో ఒక అడ్డంకులు ఎదురుకుంటూనే ఉంది చిత్ర యూనిట్..అమెరికా లో షూటింగ్ సమయంలో మంచు విష్ణు కి యాక్సిడెంట్ కావడం దాంతో షూటింగ్ కొద్ది నెలలు వాయిదా పడటం,అయినా కొద్ది రోజుల తర్వాత షూటింగ్ విజయ వంతంగా ముగించు కొని మార్చి నెలలోనే సిన్మా ని విడుదల చేయడానికి రెడీ అయ్యారు దర్శకనిర్మాతలు..కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ను అనుకున్న సమయo లో విడుదల చేయలేకపోయారు..ఇక అప్పడి నుండి సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది..ఎట్టకేలకి సినిమా ను ఈ నెల ఏప్రిల్ 27 విడుదల చేయడానికి సిద్దమైంది చిత్ర బృందం.. ఈ సారైనా అనుకున్న సమయానికి సినిమా ను విడుదల చేస్తారో లేదో మళ్ళీ ముందుకి తోస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here