ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయనుంది ఇతడే

ntr biopic

0
685

మహా నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కి మొదట దర్శకత్వ బాధ్యతలు తేజ తీసుకున్నపటికి ఈ సిన్మా నుండి ఆయన తప్పుకున్న సంగతి కూడా అందరికి విధితమే.. కానీ ఇక అప్పుటి నుండి ఈ సినిమా దర్శకత్వం వహించే ఆఫర్ పూరి జగన్నాథ్, క్రిష్,కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు వంటి ఎంతో మంది అగ్ర దర్శకులకు వెళ్ళినా వారు దీనిని సున్నితంగా తిరస్కరించారని ఫిలిమ్ నగర్ వీధుల్లో గుస గుసలు వినపడ్డాయి.కానీ నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకిదర్శకుడి గా ఒక రచయిత ను పరిచయo చేయబోతున్నాడు.ఎన్నో సినిమాల కు రచయిత గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి మాధవ్ బుర్రా ను ఈ సినిమా కి దర్శకుడి గా ఫిక్స్ అయ్యారని సమాచారం కానీ ఈ విషయాన్ని త్వరలోనే అధికారకంగా ప్రకటించనుంది చిత్ర బృందo. అయితే గతంలో సాయి మాధవ్ బుర్ర ,బాలకృష్ణ నటిoచిన గౌతమి పుత్ర శాత కర్ణి సినిమా కి మాటలు అందించాడు.ఆ సినిమా మాటల పరంగా ఎన్నో ప్రశంశలు కూడా అందుకుంది.ఆ నమ్మకo తోనే బాలయ్య బాబు సాయి మాధవ్ బుర్రా ను దర్శకుడి గా ఎంచుకున్నాడ ని ఫిల్మ్ నగర్ లో టాక్ వినబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here