కొన్ని క్షణాలు నేనే నువ్వయిపోయాను అశ్విన్ అంటూ మహానటి చూసిన సుకుమార్ స్పందన.

ఆ క్షణం నేను సుకుమార్ ని కాదు నాగ్ అశ్విన్ ను -సుకుమార్

0
807

అలనాటి అగ్రతార సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. భారీ అంచలనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యి సావిత్రి అభిమానులనే కాదు ఇండస్ట్రీ నుండి,ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకుంటూ క్లాసిక్ సినిమా గా ముందుకు దూసుకుపోతుంది.ఈ సినిమా లో సావిత్రి గారి లా కీర్తి సురేష్ నటించి అందరిని మెప్పిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా చూసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన భావోద్వేగాన్ని సోషియల్ మీడియా ద్వార డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు అభినందనలు సుకుమార్ గారి మాటల్లో ” ప్రియమైన అశ్విన్ మహా నటి సినిమా చూసి బయటికి వచ్చి, నీతో మాట్లాడుదాం అని నీకు
ట్రై చేస్తున్నాను…ఈ లోగా ఒక ఆవిడ వచ్చి నువ్వు డైరెక్టర్ వా బాబు అని అడిగింది.నేను అవునన్నాను అంతే “అంతలో నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది” ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని అంటూ”
నా కళ్ల లో నీళ్ళు…
నేను నువ్వు కాదు అని ఆవిడకి చెప్పలేక పోయాను.
ఆవిడ ప్రేమనంత నేనె తీసుకున్నాను మనసారా నన్ను ఆవిడా దీవించి వెళ్లి పోయింది.కొన్ని క్షణాలు నేనే నువ్వయిపోయాను
ఆనందం తో ఇంత కన్నా ఏం చెబుతాను నా అనుభూతి ఈ సినిమా గురించి””
గమనిక:ఆవిడకి ఎప్పటికి నేను నువ్వు కాదని తెలియకపోతే బాగుండు. అంటూ మహానటి సినిమా చూసిన సుకుమార్ తన అనుభూతి ని పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here