జూన్ 14 న తప్పకుండా సాక్ష్యం తో వస్తా అంటున్న బెల్లం కొండ శ్రీనివాస్

సాక్ష్యం తో వస్తా అంటున్న బెల్లం కొండ శ్రీనివాస్

0
593

అభిషేక్ పిక్చర్స్ పతాకం పై అభిషేక్ నామా నిర్మాత గా శ్రీవాస్ ఓలేటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సాక్ష్యం’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభించింది.యూట్యూబ్ లో ఈ టీజర్ కి 3 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.దీనితో సినిమా కి క్రేజ్ మరింత పెరిగి,సిన్మా పై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. దీనితో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ” ఈ సినిమా నిజంగా చాల క్రొత్తగా ఉండబోతుంది..మీరు ఖచ్చితంగా దర్శకుడు శ్రీవాస్ లోని ఒక కొత్త యాంగిల్ ను మీరు చూస్తారు.ప్రకృతి ని మూల బిందువుగా చేసుకొని కథ కు అనుగుణంగా దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే అందరిని మెప్పిస్తుంది. ఇటీవల అమెరికా, వారణాసి,దుబాయ్ లలో ఉన్నట్టువంటి మంచి ప్రదేశాలలో షూటింగ్ ఫినిష్ చేశాం.ప్రస్తుతం రాజమండ్రి లో మరో షెడ్యూల్డ్ స్టార్ట్ అవుతుంది.ఈ షెడ్యూల్డ్ తో సిన్మా మొత్తం కంప్లీట్ అవుతుంది.తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 వతేదీ నా ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తాం. ఈసినిమా లో బెల్లం కొండ శ్రీనివాస్ లుక్ ,నటన మరియు విఎఫ్ఎక్స్ వంటి టెక్నికల్ అంశాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల ను ఆకట్టుకుంటాయి అని గర్వంగా చెప్పగలను”అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here