తన ఆట తో హిట్టు కొట్టిన శివ

ఆట కొట్టిన శివ

0
1363

ఆ నలుగురు వంటి వైవిధ్య మైన ఎమోషనల్ డ్రామా ను డైరెక్ట్ చేసిన దర్శకుడు చంద్రసిద్ధార్త్.ఆయన దర్శకత్వం లో రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం ‘ఆట గదరా శివ’.ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు నటించిన ఈ చిత్రం నిన్న శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండే కాకుండా సినిమా క్రిటిక్స్ నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది.
ఈ సినిమా లో హీరో ఉదయ్ శంకర్ కు,దొడ్డన్న కు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ జనాల ను ఆకట్టుకున్నాయి.దాంతో ఈ సినిమా మంచి ఎమోషనల్ డ్రామా గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిన్న రిలీజ్ ఐన ఫ్రైడే మూవీస్ లో ఆట గదరా శివ ది బెస్ట్ మూవీ గా నిలవడం విశేషం.ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేస్కోవడo తో ప్రేక్షకులు ఈసినిమా కు బ్రహ్మ రథం పడుతున్నారు…ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ “ఈ సినిమా పోస్టర్స్,టీజర్ ,ట్రైలర్ ,సాంగ్స్ రిలీజ్ ఐన దగ్గర నుండి మంచి స్పందన లభించిందని.. అలాగే ఇప్పుడు సినిమాకు కూడా మంచి స్పందన లభిస్తుంది అని..సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఆనందం గా ఉంది “అని చిత్ర బృందం హర్షమ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ లో భారీ విజయం సొంతం చేసుకున్న మూవీ “రామరామారే” కి ఇది రీమేక్ అవ్వడం విశేషం…సినిమా చూసిన కొంతమంది సోసియల్ మీడియా వేదిక కా “ఈ సినిమా హిట్టు గదరా శివ”, “తన ఆట తో హిట్టు కొట్టిన శివ ” అంటూ…ప్రేక్షకులు ఆట గదరా శివ చిత్రo పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here