తన రెండో విశ్వరూపం చూపించనున్న కమల్ హాసన్

విశ్వరూపం చూపించనున్న కమల్ హాసన్

0
670

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ,నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వరూపం2’. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అయితే అన్ని పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే నెల మే లో సినిమా ను ప్రేక్షకుల ముందు కి తీసుకురావాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది..కానీ
సరిగ్గా 2013 లో మొదటి విశ్వరూపం సిన్మా ను విడుదల చేసినప్పుడు అందులోని కొన్ని కీలక సన్నివేశాలు ముస్లింల మనోభావాలని దెబ్బ తీశాయి అని సినిమా ను అడ్డుకున్నారు
అప్పుడు సీఎం జయ లలిత కూడా సినిమా చూసి కొన్ని సన్నివేశాలను తీసివేయాలని కమల్ హాసన్ ను హెచ్చరించారు
ఇంక ఏమి చేసేది లేక కమల్ హాసన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
మరి విశ్వరూపం మొదటి భాగమే ఇన్ని అటoకాలు తెచ్చిపెడితే విశ్వరూపం 2 ఎన్ని ఆటంకాలు తెస్తుందో అని కమల్ హాసన్ అభిమానులే కాదు తమిళ్,తెలుగు ఇండస్ట్రీ అంతా అనుకుంటున్నారు.. మరి కమల్ హాసన్ కి
ఈ రెండో విశ్వరూప మైన కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here