తెర మీద కి రానున్న అతిలోకసుందరి శ్రీదేవి.

sridevi biopic

0
1034
 అతిలోకసుందరి అని చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చే రూపం శ్రీదేవి. ఆమె తన అందం,అభినయం,వినయం తోనే కాదు తన నటన తో కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరిని మెప్పించి వాళ్ళ మనసులు కూడా దోచుకున్న గొప్ప నటి శ్రీదేవి. ఆనాడు అగ్ర హీరోలoదరితో జత కట్టి నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత పెళ్లి,భర్త, పిల్లలు బాధ్యత లతో చాల కాలo గ్యాప్ తర్వాత తమిళ్ లో విజయ్ నటిoచిన పులి తో, బాలీవుడ్ లో ఇంగ్లీష్-వింగ్లీష్ ,మామ్ వంటి చిత్రాలతో మళ్లీ తెర మీదికి వచ్చి అందరిని మెప్పిచింది శ్రీదేవి. అయితే కొన్ని రోజుల క్రితం శ్రీదేవి మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆమె మరణవార్తవినగానే ప్రపంచం లో ఉన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.ఇప్పటికీ ఆ షాక్ లొనే ఉంది శ్రీదేవి కుటుంబం.ఇది లా ఉండగా శ్రీదేవి భర్త బోణి కపూర్ శ్రీదేవి జీవితాన్ని సినిమా గా తీసి ప్రేక్షకులకు అందించే పనిలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం బోణికపూర్ ఫిల్మ్ ఛాంబర్ లో శ్రీ, శ్రీదేవి, శ్రీ మామ్ అనే మూడు టైటిల్స్ ను కూడా శ్రీదేవి పేరిట రిజిస్టర్ చేయించాడు.అన్నీ కుదిరితే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం లో అద్భుతం గా శ్రీదేవి జీవితాన్ని ప్రేక్షకుల ముందు ఉంచాలని బోణి కపూర్ మరియు ఆయన బృందం అనుక్కున్నట్లు సమాచారం. ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కానీ శ్రీదేవి పాత్రలో తెర పై ఎవరు కనిపిస్తారో అని శ్రీ దేవి అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అలనాటి మహానటి సావిత్రి గారు సంపాదించుకున్నంత క్రేజ్ శ్రీదేవి గారు కూడా సంపాదించుకోవడం విశేషం.కొద్ది రోజుల తర్వాత సావిత్రి గారి జీవిత చరిత్ర కూడా మహానటి గా తెర పై కి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here