‘తేజ్ ఐ లవ్ యూ’ అంటున్న కరుణాకరన్-టీజర్ కి మంచి స్పందన.

tej 143

0
672

ఏ కరుణాకరన్ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ పై కె.ఎస్ రామారావు ర్మిస్తోన్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’..ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ ఇవాళ ఉదయం చిత్ర బృందం విడుదల చేసింది.టీజర్ కి మంచి స్పందనే వస్తుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ – “సినిమా అద్భుతంగా వ‌స్తుంది. తేజు అనే పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. నందిత అనే పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు.
ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ ఐంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో క‌ష్ట‌పడి ఈ సినిమా చేస్తున్నారు. మే 1 నుండి 6 వ‌ర‌కు ఫ్రాన్స్‌లో రెండు సాంగ్స్‌ను పూర్తి చేస్తాం. గోపీసుంద‌ర్ అద్భుత‌మైన సంగీతం అందించారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ ఎంతో స‌పోర్ట్ అందిస్తున్నారు. త‌ను క్యారెక్ట‌ర్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది“ అన్నారు. చిత్ర దర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ – “సినిమాను క్యూట్ అండ్ క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఫ్యామిలీ అంతా చూడగలిగే ఎంట‌ర్‌టైన‌ర్‌. నా `తొలిప్రేమ‌, ఉల్లాసంగా ఉత్సాహంగా` సినిమాల స్టైల్‌లోనే ఈ సినిమా కూడా ఉంటుంది“ అన్నారు.చూడాలి మరి ఇంటెలిజెంట్ ప్లాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్,చిన్న దాన నీకోసం లాంటి యావరేజ్ తర్వాత కరుణాకరణ్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా ఇద్దరికి ఎలాంటి హిట్టు ఇచ్చి ట్రాక్ లో పెడుతుందో అని ప్రేక్షకులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here