నాగ్ అశ్విన్ తో పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని ఉంది-మెగాస్టార్ చిరంజీవి

movie praised by megastar

0
672

గత వారం మే 9 విడుదలైన మహా నటి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందిరికి తెలిసిందే. ఈ సినిమా గురించి సామాన్యులతో పాటు చాల మంది ఇండస్ట్రీ పెద్దలు సైతం డైరెక్టర్ నాగ్అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మెగా స్టార్ చిరంజీవి నాగ్ అశ్విన్ ను,స్వప్న దత్,ప్రియాంక దత్ ,అశ్విని దత్ లను ఇంటికి పిలిచి మరి వారికి శాలువలతో సత్కరించాడు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “”నాగ్ అశ్విన్ యంగ్ డైరెక్ట‌ర్. త‌న తొలి సినిమా బాగుంది. కానీ త‌న అనుభ‌వంతో ఈ సినిమా ఎలా చేయ‌గ‌ల‌డ‌ని మీమాంస నాలో ఉంది. ఎంత‌వ‌ర‌కూ దీనికి న్యాయం చేయగ‌ల‌డ‌ని సందేహాలుండేవి. కానీ సినిమా చూసిన త‌ర్వాత నా అనుమానాలు పటాపంచల్ అయిపోయాయి. సినిమా చూస్తున్నంత సేపు హృదయం బ‌రువెక్కింది. క‌ళ్లు చెమ‌ర్చాయి. అద్భుతంగా చేసి నాగ్ అశ్విన్ శెభాష్ అనిపించాడు. క‌థ పై ఎంత రీసెర్చ్ చేశాడో సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని, కీర్తిని పెంచిన‌వాడు అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయంగా తెలుగు ప‌రిశ్ర‌మ మ‌రో మెట్టు పైకి ఎక్కింది. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి క‌థ‌లు స్ఫూర్తిదాయ‌కంగా ఉండాలి. సావిత్రి గారు ఎంత అందంగా ఉన్నారు? ఆమె చిన్న‌ప్ప‌టి బాల్యం? స‌్టార్ అయిన త‌ర్వాత ఆమె ప‌రిస్థితులు? త‌ర్వాత ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? అనేది అద్భుతంగా చూపించారు. అది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం.

సినిమా ప్రారంభం నుంచి ఎండిగ్ వ‌ర‌కూ చాలా అందంగా..అద్భుతంగా చూపించారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌డం అన‌డం కంటే జీవించింది అన‌డం క‌రెక్ట్. సినిమా లోకి వెళ్లే కొద్ది సావిత్రిని చూస్తున్న‌ట్లు అనిపించి. దుల్కార్ సల్మాన్ జెమిని గ‌ణేష్ గారిలానే అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌తో క‌లిసి రుద్ర‌వీణ చేసాను. ఇలా ప్ర‌తీది ఈ సినిమా న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అందుకే ఈసినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యాను. మే 9న నా `జ‌గ‌దీక‌వీరుడు అతిలోక సుంద‌రి` సినిమా రిలీజైంది. అదే రోజున `మ‌హాన‌టి` కూడా రిలీజైంది. అనుకోకుండా జ‌రిగిందో…కావాల‌ని అలా ప్లాన్ చేసారో? తెలియ‌దు గానీ! చాలా సంతోషంగా ఉంది. అందుకు మ‌హాన‌టి టీమ్ అంద‌ర్నీ అభినందిస్తున్నా” అంటూ మహానటి టీం పై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. అయితే అదే సమయంలో చిరంజీవి తన మనసు లో మాట బయట పెడుతూ “నాగఅశ్విన్ దర్శకత్వంలో నాకు నటించాలని ఉంది, అతడి దర్శకత్వంలో పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని ఉంది అంటూ చిరంజీవి మీడియా ముకంగా చెప్పుకొచ్చాడు.అయితే నాగఅశ్విన్ ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని చిరంజీవి కోసం పాతాళ భైరవి లాంటి కథ రాసి చిరంజీవి కోరిక తీరుస్తాడేమో చూడాలి మరి.అన్నీ కుదిరితే ఈ సినిమా ను అశ్వినీ దత్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here