నాలుగు మెట్లు ఎక్కిన నాగశౌర్య.

4crores

0
705

ఊహలు గుస గుస లాడే సినిమా తో మొదటి హిట్టు ను తన ఖాతా లో వేసుకొని.ఆ తర్వాత జాదూగాడు,లక్ష్మిరావే మా ఇంటికి,నారా రోహిత్ తో కలిసి జ్యో అచ్యుతానంద,కథ లో రాజకుమారి వంటి సినిమా లు చేసినప్పటికీ ఏది తనకి అంతగా మంచి హిట్టు తీసుకురాలేకపోయాయి..కానీ దిక్కులు చూడకు రామయ్య,ఒక మనసు,జ్యో అచ్యుతానంద సినిమాలు మాత్రం నాగ శౌర్య కి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి..ఇదిలా ఉండగా సినిమాలు చేజారి పోతున్న సమయంలో మనోడు తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ లోనే వెంకీ కుడుముల అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఛలో అంటూ ఈ సంవత్సరం భారీ విజయాన్నే తన ఖాతా లో వేసుకున్నాడు నాగ శౌర్య.
ఈ సినిమా అందించిన విజయoతోనే మనోడు తన రెమ్యూని రేషన్ అమాంతం 4 కోట్ల కి పెంచేశాడు. నాగ శౌర్య తో సినిమా చేయాలి అనుకుంటున్న నిర్మాతల కి ఈ విషయం తెలియగానే
ఛలో అంటూ వెనుతిరగి వేరే హీరో లను సంప్రదిిస్తున్నారు నిర్మాతలు..ప్రస్తుతం నాగ శౌర్య తన సొంత బ్యానర్ లోనే రెండో సినిమా నర్తన శాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.చూడాలి మరి నాగశౌర్య తన వచ్చే సినిమాలతో ఎలా ఆకట్టుకుంటాడో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here