నానీ… ఈ సారికి పోనీ అంటున్న అభిమానులు

0
668

ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యే సినిమాలు ఫట్టు మనడం, ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యే సినిమా లు హిట్టు కొట్టడం కామన్ అయితే దాదాపు మూడు సంవత్సా రాల నుండి వరుస హిట్ల తో డబుల్ హాట్రిక్స్ తో మోత మోగించాడు నాచురల్ స్టార్ నాని.ఈ సంవత్సరం కూడా తన హవా కొనసాగించాలనే ప్రయత్నం లో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాడు నాని.గత వారం భారీ అంచలనాలతో రిలీజ్ అయిన ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.కాని ఈ సినిమా లో నాని చేసిన చిత్తూర్ కృష్ణ క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందకల్గింది.దర్శకుడు గాంధీ మాత్రం ఒకే క్యారెక్టర్ పై పెట్టిన దృష్టి రెండో క్యారెక్టర్ పై కూడా పెట్టి ఉంటే సినిమా ఖచ్చితంగా విజయం సాధించేది.. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ ఐన వారనికే భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రావడం తో మహేష్ దెబ్బకు కృష్ణార్జునులు ఇద్దరు కనిపించకుండా పోయారు..అభిమానులు కూడా నానీ ఈసారి కి పోనీ అంటూ నాని కి దైర్యం చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here