నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ట్రైలర్ కి విశేష స్పందన.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ట్రైలర్ కి విశేష స్పందన.

0
952

రచయిత వక్కoతం వంశీ దర్శకుడి గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, అను ఏమాన్యుల్ జంటగా నాగబాబు సమర్పణలో, రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష శ్రీధర్ నిర్మాతగా,బన్నీ వాసు సహా నిర్మాత గా తెరకెక్కుతున్న చిత్రం “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా” మొదటి నుంచి ఈ సినిమా కి సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్,టీజర్ ,సాంగ్స్ వంటి వాటికి మంచి స్పందనే లభిస్తూ వస్తుంది.ఈ సినిమా యాక్షన్ కింగ్ అర్జున్,శరత్ కుమార్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే అన్ని సెన్సర్ పనులు పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ తో వచ్చే నెల మే 4 నా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్దం అవుతుంది.అయితే ఇవాళ చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..” మా ఈ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి మొదటి నుండి మంచి పాజిటివ్ టాకే వస్తుంది.ప్రతి భారతీయుడు ఇది మా సిన్మా అని ఖచ్చితంగా కాలర్ ఎగేసుకొని గర్వంగా చెప్పుకొనే విధంగా చిత్రం ఉంటుంది.
ఈ చిత్రంలో చాల సర్ ప్రైజ్ లు ఉన్నాయి.ఇది బన్నీ కెరీర్ లొనే ఒక అద్భుతమైన చిత్రం గా నిలిచిపోతుంది అని అన్నారు.అయితే ట్రైలర్ కి విశేష మైన స్పందన రావడం తో పాటు సిన్మా మీద అంచనాలు కూడా భారీ స్థాయి లో నెలకొన్నాయి. మీరు కూడా ట్రైలర్ ని ఓ లుక్కేసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here