నా సినిమా కు నేనే రాజు నేనే మంత్రి అంటున్న బాలయ్య

balayya as director

0
669

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బయోపిక్ సినిమాల హవా నడుస్తుంది.తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహా గొప్ప నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ను కూడా సినిమా ద్వార తెర పైకి తీసుకొస్తున్నారు ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ.స్వయంగా ఆయనే తన తండ్రి పాత్రను పోషిస్తున్న విషయం అందరికి తెలిసేందే గత నెల మార్చి 29 నా నాచారం లోని రామకృష్ణ స్టూడియో లో ఈ సినిమా కి సంబంధించిన పూజ కార్యక్రమం నందమూరి కుటుంబ సభ్యుల మధ్య,ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిధిగా ఆయన సమక్షంలో అట్టహాసం ప్రారంభమైన విషయం కూడా అందరికి విధితమే.. ఈ సినిమా కు దర్శకత్వ బాధ్యతలు తేజ తీసుకున్నప్పటికీ సడన్ గా ఒక రోజు ఆయనే స్వయంగా నేను ఎన్టీఆర్ సినిమా నుండి తప్పుకుంటున్నాను
నేను ఈ సినిమా కి సరైన న్యాయం చేయలేను అనిపించి బాలకృష్ణ గారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ ఒక్క సారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు తేజ..అయితే ఇంక అప్పుడు నుండి బాలకృష్ణ ఈ సినిమా కి దర్శకుడి గా ఎవరిని ఎన్నుకుంటాడు ,వివి వినాయక్,కృష్ణ వంశీ ,పూరి జగన్నాథ్ వంటి అగ్ర దర్శకుల పేర్లు కూడా వినిపించాయి..కానీ వాటన్నింటికీ బాలయ్య బాబు చెక్ పెడుతూ తానే స్వయంగా ఎన్టీఆర్ సినిమా దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు..ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ వర్గాల పెద్దలు కూడా బాలయ్య బాబు ఎన్టీఆర్ పాత్రలో మరియు దర్శకుడు గా సిన్మా కి ఏ మేరకు న్యాయం చేయగలడు అంటూ అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా కు ఆయనే నిర్మాత కూడా కావడం విశేషం అయితే బాలయ్య మాత్రం నా సినిమా కి నేనే రాజు నేనే మంత్రి అంటూ నమ్మకం గా చెబుతున్నాడు.. మరి బాలయ్య బాబు నిర్మాత గా,దర్శకుడు గా, ఎన్టీఆర్ పాత్రలో నటుడిగా ఏమాత్రం న్యాయం చేస్తాడో చూడాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here