పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “ఆటగదరా శివ”

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ చేతుల మీదుగా “ఆటగదరా శివ”

0
318

ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర లో బిజీ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.

కాగా ఒక వైపు రాజకీయంగా ఎంత బిజీ గా ఉన్న సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ వస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో వస్తున్న “ఆటగదరా శివ” సినిమాకి సంబంధించిన “ఎట్టాగయ్య శివ” అనే వీడియో లిరికల్ ను పవర్ స్టార్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన రామ రామ రే సాంగ్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.

ఇక సినిమా, కన్నడ చిత్రమైన “రామ రామ రే” రీమేక్ అన్న విషయానికి తెలిసిందే. డైరెక్టర్ చంద్ర సిద్దార్థ తన దైన శైలిలో సరి కొత్తగా తెరకెక్కించారని సమాచారం.

ఉదయ్ శంకర్ నూతన నటుడు నటిస్తుండగా రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందింస్తున్నారు.

ఇప్పటికే పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా జులై 20 న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here