బోయపాటి సినిమా లో రాజమౌళి విలన్.

0
590

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే..ఈ మధ్యనే చరణ్ కూడా షూటింగ్లో పాల్గొన్నాడు.
అయితే చరణ్ కూడా తన పూర్తి లుక్ ను బోయపాటి చెప్పినట్టు గా మార్చేశాడు.బోయపాటి సినిమా అనగానే మంచి
యాక్షన్ ,మంచి ఫైట్స్ అదిరిపోయే డై లాగ్స్ కూడా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. వాటికి తగినట్టు పాత్ర లను ఎంపిక చేయడం లో కూడా బోయపాటి ఒక మెట్టు పైనే ఉంటారు అని చెప్పొచ్చు.. ఇప్పటికే సినిమా లో భారీ తారాగనాన్నే ఎంచుకున్నాడు బోయపాటి శ్రీను.ఇది లా ఉండగా సినిమాలోని ఒక కీలక పాత్ర కి కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ను తీసుకొని సినిమా పై అంచనాలను మరింత పెంచేశాడు బోయపాటి శ్రీను.అయితే కిచ్చా సుధీప్ రాజమౌళి తీసిన ఈగ సినిమా ద్వార తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత బాహుబలి లో కూడా ఒక చిన్న పాత్రలో తళుక్కు మని మెరిసి మెప్పిoచాడు…అయితే ఫైట్స్ కి,యాక్షన్ కి ఏ మాత్రం కొదవ లేకుండా ఉండే బోయపాటి లాంటి సినిమా లో కిచ్చా సుధీప్ రామ్ చరణ్ తో కలిసి ఎలా మెప్పిస్తాడో అనీ అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్డ్ షూటింగ్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్డ్ షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here