మా ఇద్దర్ని చూసే రాజమౌళి మాతో సినిమా చేస్తున్నారేమో- రామ్ చరణ్.

RajaMouli Ramcharan Ramarao- R3 Project Update.

0
386

 

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే నే అంచనా లు ఆకాశం అంచు లో ఉంటాయి.అలాంటిది ఆయన సినిమా లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీయార్ హీరోలుగా సినిమా అంటే ఇంక ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు వీరి సినిమా షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కాక‌ముందే అంచ‌నాలు తార‌స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాను 200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెకిస్తున్నటు.ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంతో రూపొందుతోంద‌ని, ఇందులో చెర్రీ, ఎన్టీయార్ అన్న‌ద‌మ్ముల‌గా నటిస్తున్నారని ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా  ఈ సినిమా గురించి చెర్రీ.. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ. “ఈ సినిమా క‌థ గురించి ఇంకా నా‌కేమీ తెలియ‌దు. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడ‌నే కార‌ణంతోనే ఆ సినిమా అంగీక‌రించాను . అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ గురించి కూడా మాట్లాడాడు. `ఎన్టీయార్‌, నేను మంచి మిత్రులం. మేం మూడు నెల‌లకోసారి క‌లుస్తూనే ఉంటాం. ఇటీవ‌లె తార‌క్ వివాహ వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నాం. మా స్నేహం చూసిన త‌ర్వాతే మా ఇద్దరినీ పెట్టి సినిమా తీయాల‌ని రాజ‌మౌళిగారికి అనిపించిందేమోన‌`ని చెర్రీ మీడియా ద్వార చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here