మేము సైతం అంటూ..రోడ్ మీద ఐస్ క్రీమ్స్ అమ్మిన చిట్టిబాబు.

charan for a cause

0
873

రంగస్థలం సీనిమా అందించిన విజయం తో మంచి జోష్ మీద ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ సడన్ గా రోడ్ మీద ఐస్‌క్రీమ్స్ అమ్ముతూ అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. రామ్ చరణ్ ఐస్ క్రీ మ్స్ అమ్మడం ఏంటి అనుకుంటున్నారా.? వివరాల్లోకి వెళితే

కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారికి సహాయం చేసేందుకు గాను మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ఓ టీవీ ఛానెల్ వారు ‘మేము సైతం’ అనే ఒక ప్రతిష్టాత్మకమైన అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తినడానికి తిండి లేని ఉండడానికి గూడు కూడా లేని కడు పేద రికంతో బాధ పడే వారికి సహాయం చేస్తూ అండగా నిలబడుతుంది ఈ మేము సైతం
ఈ కార్యక్రమం ద్వారా అనాధలకు, నిరుపేదలకు తమ వంతు సహాయం చేసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాల మంది సినీ తారలు ఎదో ఒక పని చేసి దాని ద్వారా వచ్చిన డబ్బును పేదల సహాయ నిధిగా అందించిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా రామ్‌చరణ్.. కూడా నడుం బింగించాడు తానే స్వయంగా ఐస్‌క్రీం అమ్మి దాని ద్వారా వచ్చిన సొమ్మును పేదలకు ఆర్థిక సహాయంగా ఇస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు సహాయంగా చేసేందుకు బాగా కష్టపడ్డాడు చెర్రీ.ఐతే రాంచరణ్ ఐస్ క్రీమ్స్ అమ్మేటపుడు అక్కడ ఉన్న అభిమానులు ,సామాన్య ప్రజలు సైతం ఐస్ క్రీమ్స్ కొని రామ్ చరణ్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేదల సహాయార్థం చెర్రీ చేస్తున్న ఈ పనిని చూసి మెగా అభిమానులు తెగ సంబర పడి పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here