మైలేజ్ పెంచుతున్న RX 100

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా

0
737

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన అమ్మాయి గుర్తుకొస్తుంది. ప‌ల్స‌ర్.. అన‌గానే జ‌ర్‌… జ‌ర్‌.. అంటూ దూసుకుపోయే త‌త్వం ఉన్న కొంటె కుర్రాడు అల్లరిగా క‌న్నుగీటుతున్న‌ట్టు ఉంటుంది. వీట‌న్నిటిలాగే `RX 100`కీ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆ పేరు చెప్ప‌గానే యారొగెంట్ కేరక్ట‌ర్‌ గుర్తుకొస్తుంది. నిజ‌మే… `RX 100` సౌండే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. RX 100 బైక్ ఒక జ‌న‌రేష‌న్‌కి ఫేవ‌రేట్ బైక్‌. మాస్‌ని అమితంగా ఆక‌ట్టుకున్న బైక్‌. మ‌రి… అంత మందిని ఆక‌ట్టుకున్న ఆ బైక్ పేరు మా సినిమాకు ఎందుకు పెట్టాం? అనేది తెలుసుకోవాలంటే జూన్ వ‌ర‌కు ఆగాల్సిందే… అని అంటున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌ `RX 100` చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. ( An Incredible Love Story ) అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here