రవితేజ తో ‘తేరి’ అంటున్న కందిరీగ డైరెక్టర్.

raviteja new movie

0
642

మాస్ మహారాజ్ రవి తేజ కొద్ది రోజుల విరామమ్ తర్వాత రాజా ది గ్రేట్ అంటూ ప్రేక్షకుల ను మెప్పించి ఆ తర్వాత టచ్ చేసి చూడు అంటూ మళ్ళీ ప్రేక్షకుల ను నిరాశ పరచడం తో ఈశారు ఆచి తూచి అడుగు వేస్తున్నాడు.అక్కినేని నాగార్జున కి సోగ్గాడే చిన్ని నాయన,నాగచైతన్య కి రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్లను అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ అనే ఒక మాస్ మూవీ ని చేస్తున్నాడు మాస్ మహా రాజ్.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సిన్మా ఫస్ట్ లుక్,టీజర్ లు చెబుతున్నాయి సినిమా కు ఉన్న స్టామినా ఏంటి అని.అయితే ఈ సినిమా అనంతరం రవి తేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో అమెరికా లో జరగన్నున “అమర్ అక్బర్ ఆంటోనీ” మూవీ సెట్ లోకి వెళ్లనున్నాడు..దీని తర్వాత ఇంకో సినిమా ను కూడా రవి తేజ లైన్లో పెట్టేశాడు.ఎనర్జిటిక్ స్టార్ తో కందిరీగ తీసిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.అయితే ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన “తేరి” కి రీమేక్ గా ఉండబోతుంది అంటూ వచ్చిన వార్తలను సంతోష్ శ్రీనివాస్ బృందం కొట్టి పడేసి..ఒక క్లారిటీని ఇచ్చింది అదేంటంటే ” ఈ సినిమా కి లైన్ మాత్రమే తేరి నుండి తీసుకున్నామని,కథ,కథనాలు అన్ని కొత్తగా ఉంటాయని,మన నేటివిటీకి సరిపోయేలా సినిమా ఉంటుంది అంటూ” చెప్పుకొచ్చారు..ఈ సినిమా లో కాజల్ అగర్వాల్, కేథరిన్ తెరిసా లు హీరోయిన్ లు గా నటించనున్నారు.ఈ మూవీ ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుoడటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here