రవితేజ “నేలటికెట్” కోసం రానున్న పవర్ ★ పవన్ కళ్యాణ్.

power star as chief guest

0
749

సోగ్గాడే చిన్ని నాయన ఫేం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో మాస్ మహా రాజ్ నటిస్తున్న తాజా మాస్ చిత్రం ‘నేల టికెట్’. ఈ సినిమా మొత్తం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశ కి చేరుకోవడం తో ఈ సినిమా కి సంబందించిన ఆడియో వేడుకను ఈ నెల మే 12 హైదరాబాద్ లోనిర్వహించనున్నారు.
ఈ వేడుక కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిధి గా రానున్నారు. అయితే మొదటి నుండి మెగా ఫ్యామిలీ తో రవితేజ కి ఉన్న మంచి అనుబంధమే ఉంది.పవన్ కళ్యాణ్ ,రవితేజ కూడా ఇద్దరు మంచి మిత్రులు అన్న సంగతి
తెలిసిందే. దాంతో రవితేజ పవన్ కళ్యాణ్ ను ఆడియో వేడుక కు రావడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.దీంతో ఈ నేల టికెట్ సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరగా చేరుతుందని చిత్ర బృందం ఆశిస్తుంది.అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ ,రవితేజ అభిమానులు ఆడియో వేడుక కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.రామ్ తాళ్లూరి నిరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శక్తి కాంత్ అందిస్తుండగా..రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here