హిట్టు కొట్టిన మహేష్ గిఫ్టు పట్టిన కొరటాల శివ.  

గిఫ్టు పట్టిన కొరటాల శివ.  

0
725

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి రెండు సినిమా లతో ప్రేక్షకుల ను నిరాశ పరిచిన విషయం అందరికి తెలిసిందే ఈ రెండు భారీ పరాజయాల తర్వాత శ్రీమంతుడు సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ పైకి వచ్చాడు మహేశ్ బాబు. ‘శ్రీమంతుడు’తో వచ్చి ఇండస్ట్రీ మరచిపోలేని బ్లాక్ బస్టర్ ను అందించాడు మహేశ్‌.మహేష్ కు భారీ విజయాన్ని ఇచ్చిన కొరటాల శివకు అప్పట్లో.. ఓ కాస్ట్ లీ కారును గిఫ్ట్ గా ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు మహేశ్ బాబు. అప్పుడు సక్సెస్‌లో కంటే మహేశ్ ఆనందం పాళ్లు ఇంకా పెరిగాయి. తర్వాత ar మురుగదాస్ తో ‘స్పైడర్’ వైవిధ్య మైన సినిమా చేసినప్పటికీ మళ్ళీ ఘోర పరాజయం చూడక తప్పలేదు మహేష్ బాబు.అయితే సరిగ్గా ఈ సమయంలో మళ్ళీ కొరటాల శివ మహేశ్ కాంబినేషన్ నుంచి వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా మహేశ్‌కు పూర్తి స్థాయి సంతృప్తిని,పేరు ఇచ్చింది. ఇప్పటివరకూ వరుస విజయాలను అందుకున్న కొరటాల శివ ఖాతాలో మరో హిట్ చేరినట్టైంది. మరోవైపు.. ఈ సినిమా సక్సెస్‌ను ముందుగానే ఊహించి మహేశ్.. ఆ కాన్ఫిడెన్స్‌తో సినిమా విడుదల కు ముందు దర్శకత్వ శాఖలో పనిచేసిన సభ్యులకు ఐఫోన్స్ పంచి సినిమా కచ్చితంగా హిట్ అంటూ ముందు గానే సింబాలిక్ గా చెప్పాడు.ఇక సినిమా విడుదలై విజయాన్ని అందించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు కొరటాల శివకు..మరో సారి ఓ భారీ బహుమతిని అందించినట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ‌సారి ఏకంగా ఓ విల్లానే కొరటాల శివకు గిఫ్ట్‌గా ఇచ్చాడట మహేశ్ బాబు. హైద్రాబాద్ పరిసరాల్లోని ఓ లగ్జరీ విల్లాను.. బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి.. ఈ బహుమతులు కొరటాల శివకు మాత్రమేనా.. లేక మున్ముందు తనతో హిట్ కొట్టబోయే ప్రతీ దర్శకుడికి ఇలాగే ప్రోత్సహిస్తాడో లేదో చూడాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!.ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here