చిట్టిబాబు అన్నయ్య కి పెళ్ళంటా..!

అన్నయ్య కి పెళ్ళంటా..!

0
824

గ్రేట్ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి రెండో తనయుడు ఆది పినిశెట్టి అదేనండీ మన రంగస్థలం కుమార్ బాబు. మృగం సినిమా తో హీరో గా వెండితెర కి పరిచయమై ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో హీరో గా కొన్ని సినిమా లు చేసినప్పటికీ ఏ సిన్మా తనని హీరో గా నిలబెట్ట లేకపోయింది. ఇంక ఆది నిలదొక్కుకోవడం కష్టం అని ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలో మనోడు బోయపాటి శీను-అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు చిత్రం తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి
తానెంటో నిరూపించుకున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో అజ్ఞాతవాసి,ఇప్పుడు రికార్డులు కొల్లగొడుతున్న సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ రంగస్థలం తో కుమార్ బాబు గా మంచి మార్కులే కొట్టేశాడు.
అయితే దీపం ఉన్నపుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనోడికి బాగా తెలిసి నట్టు ఉంది అందుకే రంగస్థలం సిన్మా ఇచ్చిన మంచి ఉత్సాహం తో పెళ్లి కి రెడీ అయిపోయాడు ఆది పినిశెట్టి. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు పెళ్లి చేసుకుంటాని ప్రస్తుతం తన తల్లిదండ్రులు అదే పని లో ఉన్నారని తన మనసులో మాట బయిట పెట్టేశాడు ఈ రంగస్థలం కుమార్ బాబు అదేనండీ ఆది పినిశెట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here