200 కోట్ల దిశ గా పరుగులు తీస్తున్న చిట్టిబాబు

megapoer star @200

0
786

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిట్టి బాబు గా, సమంత రామ లచ్చిమి గా పక్కా పల్లెటూరు వాతావరణం లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన గొప్ప చిత్రం రంగస్థలం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం గురించి అందరికి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా ఈ రంగస్థలం విజయాయోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ నెల రోజులుఅవుతున్నా ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట ఇంకా కలెక్షన్ల వర్షం కురూపిస్తూనే ఉండటం విశేషం. అసలు ఎక్కడా కలెక్షన్స్ తగ్గకుండా ఈ సినిమా ప్రస్తుతం 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.ఈ సినిమా తో రామ్ చరణ్ తన స్టామినా ఏంటో మరో సారి నీరూపించుకున్నాడు.మగ ధీర తర్వాత రామ్ చరణ్ కెరీర్ లొనే రంగస్థలం రెండో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు.200 కోట్ల వైపు పరుగులు తీస్తుండటం తో ఈ సినిమా ను నిర్మించిన మైత్రి మూవీస్ అధినేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి చిట్టి బాబు 200 ల దగ్గెరే ఆగిపోతాడో లేక ఇంకా ముందు పరిగెడుతాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here